Wednesday, March 26, 2025

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో మరో మృతదేహం వెలికితీత

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్‌లో మరో మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికి తీశాయి. టన్నెల్‌లో ప్రమాదం జరిగిన రోజు నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టన్నెల్ బోర్ మిషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. తాజాగా మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు.

మృతి చెందిన వ్యక్తి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రాజెక్టు ఇంజినీర్‌ మనోజ్‌ కుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం జరిగిన తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ సంతోష్‌కుమార్ తెలిపారు. మిగిలిన ఆరుగురి కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News