నెల్లూరు: ఇక్కడ మనీ స్కీమ్ తరహా మోసం వెలుగుచూసింది. నెల్లూరులోని పొదలకూరు రోడ్దు ప్రాంతంలో విశ్వనాథ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏజెంట్లను పెట్టుకుని అమాయక ప్రజల నుంచి భారీగా నగదు పోగుచేసుకుని మోసం చేశారు. చైన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ద్వారా రూ. 500 కడితే రూ. 7లక్షలు, రూ. 6వేలు కడితే రూ. 18 లక్షలు ఇస్తామని మోసం చేశారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 10 వేల మంది నుంచి రూ. 500 మొదలుకుని రూ. 6వేల వరకు సేకరించారు. డబ్బు కట్టిన వారు డబ్బు తిరిగి ఎప్పుడు చెల్లిస్తారంటూ ట్రస్టు కార్యాలయానికి చేరుకున్నారు. నిలదీశారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసు అధికారులను కోరుతున్నారు. హైదరాబాద్ లో కూడా ఇలాంటి మోసాలు (ఆల్ఫెన్ 2023-బి.కామ్) గత సంవత్సరం జరిగాయి. అంతా మునిగారు. ఫిర్యాదు చేసినా డబ్బు తిరిగి రాలేదు. మీ డబ్బు ఇంతవుతుంది, అంతవుతుంది అంటే నమ్మకండి. తప్పుడు ఫ్రూఫ్ లు కూడా చూపి నమ్మిస్తారు. జాగ్రత్త.