Sunday, December 29, 2024

రాబిన్‌హుడ్ నుంచి ‘వన్ మోర్ టైమ్..’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్ నటించిన రాబిన్‌హుడ్ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్- వన్ మోర్ టైమ్‌ని రిలీజ్ చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ప్రేమకోసం తన గర్ల్ ఫ్రెండ్‌తో మరో అవకాశం కోరే హీరో గురించిన సాంగ్ ఇది. అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాటకు కృష్ణకాంత్ యూత్‌ఫుల్ లిరిక్స్ రాశారు. నితిన్, శ్రీలీల అద్భుతమైన కెమిస్ట్రీ, ఆకర్షణీయమైన డ్యాన్స్‌తో ఈ పాట అందరినీ అలరిస్తోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News