Monday, December 23, 2024

‘వాహ్’.. వన్ మోటో

- Advertisement -
- Advertisement -

One Moto has launched three electric scooters

రాష్ట్రంలో రూ.250 భారీ పెట్టుబడి
హైదరాబాద్ శివారులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్
రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఒయు మార్కెట్‌లోకి స్కూటర్లు విడుదల

మనతెలంగాణ/ హైదరాబాద్: కొత్త సంవత్సరం ఆరంభంలోనే వన్ మోటో సంస్థ రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్ అన్నారు. సోమవారం రాష్ట్రంలో యూకెకు చెం దిన సంస్థ వన్ మోటో ఎలక్ట్రికల్ వాహన తయారీ సంస్థ తయారు చేసిన వాహనాన్ని ఆయన విడుదల చేశారు. ఇది క్లాసిక్, రెట్రో స్టైల్ లుక్‌లతో ఉందన్నారు. ప్రముఖ బ్రిటన్ ఎలక్ట్రిక్ వాహన త యారీ సంస్థ వన్ మోటో ఓలాకు పోటీగా రాష్ట్రం లో భారీ ఎలక్ట్రిక్ వాహన తయారీ కేంద్రం ఏర్పా టు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పం దం (ఎంఒయు) కుదర్చుకుంది. హైదరాబాద్ శివారులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఈ కంపెనీ బ్రాండ్ రూ.250 కోట్ల మేర పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి సెమీ- రోబోటిక్స్ వంటి అధునాతన యంత్రాలతో కర్మాగారం నిర్మిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

3 స్కూటర్లను విడుదల చేసిన కంపెనీ

రెండు నెలల కాలంలోనే వన్ మోటో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి స్పెసిఫికేషన్స్ చూస్తే ఇతర కంపెనీలకు పోటీ ఇచ్చే విధంగా ఉన్నాయి. వన్ మోటో తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలెక్టాను ధర రూ.2 లక్షలు(ఎక్స్ షోరూమ్)కు మార్కెట్లోకి విడుదల చేసింది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్ళే సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. వన్ మోటో ఇండియా సీఈఒ శుభంకర్ చౌదరి మాట్లాడుతూ.. ‘కొత్త తయారీ ప్లాంట్ తో మేము భారత్‌లోని వినియోగదారులకు సేవలందించడమే కాకుండా, వన్ మోటో అభివృద్ధి చేస్తున్న వాహనలను ఇతర ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈవీ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కోసం ప్రత్యేక నైపుణ్యం గల మానవ వనరులు అవసరం గనుక మేం రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తాం.ఈ కేంద్రంతో ్ల రాష్ట్రంలో దాదాపు 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 2000 మందికి పరోక్ష ఉద్యోగాలను రానున్నట్లు తెలిపారు.అదే విధంగా హైదరాబాద్‌లో హెచ్‌పిసిఎల్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మొదటి బ్యాటరీస్వైప్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News