Sunday, December 22, 2024

ఒకే దేశం, ఒకే ఎన్నిక తప్పనిసరి : రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

కోలాయత్ ( రాజస్థాన్ ): దేశ వనరులు, సమయం ఆదా కావాలంటే “ ఒకేదేశంఒకే ఎన్నిక ” విధానం తప్పనిసరి అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. దేశ ప్రజలంతా దీనికి మద్దతు చెబుతారని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఈ ఆలోచనను కాంగ్రెస్ పార్టీ మాత్రమే వ్యతిరేకిస్తోందని, ప్రతి విషయాన్ని వ్యతిరేకించడమే ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. రాజస్థాన్ లోని బికనెర్ జిల్లా కోలాయత్‌లో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.

రాజస్థాన్ లోని గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ వారి హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండేవి కావని, బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాకే శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని కితాబు ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో పెరిగిందని, గతంలో అంతర్జాతీయ వేదికలపై దేశ వాణిని పట్టించుకునే వారే కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచం లోనే 11 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఇప్పుడు ఎదిగిందని, ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఎదుగుతుందని సర్వేలు, సమీక్షలు చెబుతున్నాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News