Friday, December 27, 2024

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ సరే… బిసిల సంగతేంటి?

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిసి బిల్లు పెట్టాలి
ఈ నెల 21న ఛలో ఢిల్లీ : ఆర్ కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బాగానే ఉంది, ఆ వన్ నేషన్ లో భాగమైన బిసిల బతుకుల గురించి పట్టదా ? అని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, మహిళా బిల్లులో బిసి, ఎస్‌సి, ఎస్‌టి మహిళలకు సబ్ కోటా కల్పించాలని, కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సెప్టెంబర్ 21న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్ ను దిగ్భందం చేస్తామని కృష్నయ్య హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలో బిసి కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారం ఆహిర్‌ను కృష్ణయ్యనేతృత్వంలో ప్రతినిధిబృందం కలిసి వినతిపత్రం సమర్పించింది.

అనంతరం కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో మహిళా బిల్లు పెట్టాలని ప్రతిపాదించారు. మహిళా బిల్లులో బిసి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళ బిల్లుకు సార్ధకత ఉండదన్నారు. ఇప్పటికే మహిళ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్ సభలో కూడా పెట్టి పూర్తి చేయాలని కోరారు. మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులు బిసి మహిళల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మహిళ బిల్లు పాస్ కావాలంటే బిసి మహిళలకు సబ్- కోటా ఇవ్వక తప్పదన్నారు. మహిళ బిల్లులో రాజకీయ రిజర్వేషన్ల తో పాటు విద్యా – ఉద్యోగాలలో కూడా 50 శాతం రిజర్వేషన్ల ను ప్రవేశపెట్టాలని కోరారు. రాజకీయ రిజర్వేషన్ల ను పెడితే 180 మంది మహిళలు పార్లమెంటులో సభ్యులవుతారని, ఉద్యోగాలలో రిజర్వేషన్లుపెడితే కేంద్ర ప్రభుత్వం లోని 54 లక్షల ఉద్యోగాలలో 27 లక్షల ఉద్యోగాలు, 29 రాష్టలలో కలిపి ఒక కోటి 80 లక్షల ఉద్యోగాలలో 90 లక్షల ఉద్యోగాలు మహిళలకు దక్కుతాయని కృష్ణయ్య పేర్కొన్నారు. మహిళా బిల్లుతో పాటు బిసి బిల్లు కూడ పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. బిసి బిల్లు పెట్టినప్పుడే మహిళలకు సబ్ కోట కల్పించడానికి వీలువుతుందిన్నారు.

వచ్చే అసెంబ్లీ – పార్లమెంట్ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బిసి లకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు. బిసిలకు అన్యాయం చేసే పార్టీల బరతం పడతామని హెచ్చరించారు. మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం రెండు సిఫార్సులు మాత్రమే అమలుచేశారు. మిగతా 38 సిఫార్సులు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ సిఫార్సులకు విలువలేదా? అని ఆయన ప్రశ్నించారు. జనగణనలో కుల గణన చేపట్టాలని, పంచాయతీరాజ్ సంస్థలో బిసి రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలని కోరారు. ప్రధాన మైన 14 డిమాండ్లపై వినతిపత్రం సమర్పించినట్లు తెలపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News