Saturday, February 22, 2025

మహబూబ్‌నగర్ డిసిసిబి ఛైర్మన్ పదవికి ఒకే ఒక నామినేషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబ్‌నగర్ డిసిసిబి ఛైర్మన్ పదవికి ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. డిసిసిబి ఛైర్మన్ పదవికి డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేశారు. ఒక నామినేషన్ రావడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.  డిసిసిబి చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, నారాయణ పేట ఎమ్మెల్యే డాక్టర్ పర్నికా రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ లు మహబూబ్ నగర్ డిసిసిబి కార్యాలయానికి చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News