హైదరాబాద్: ఆమ్నీషియా పబ్ గ్యాంగ్‌పై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేపు కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాలిక వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన సుభాన్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియోలను మీడియా ఎదుట విడుదల చేసిన బిజెపి శాసన సభ్యుడు రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఈ కేసులో కీలకంగా మారనుంది. ఇప్పటికే ఇన్నోవా కారులో క్లూస్ టీమ్ అధారాలు సేకరించింది. కారులో సరిపడా ఆధారాలు లభించకపోవడంతో టెక్నికల్ ఎవిడెన్స్‌పై దృష్టి పెట్టారు. నిందితుల కాల్ డేటా రికార్డింగ్స్, సిసి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితుల మొబైల్ టవర్ టోకేషన్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
పబ్ నుంచి తిరిగి జూబ్లీహిల్స్‌లో బాధితురాలిని డ్రాప్ చేయడంతో పాటు రూట్ మ్యాప్‌లో కీలక ఆధారాలు సేకరించనున్నారు. బాధితురాలి వాంగ్మూలం పోలీసులు తీసుకోనున్నారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను పోలీసులు కస్టడీకి కోరుతున్నారు. నాంపల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. గ్యాంగ్ రేప్ కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. డిజిపి సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కోరింది. రిపోర్ట్ వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.