Sunday, December 22, 2024

అత్తాపూర్ లో దారుణం..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటలకు తాళలేక కొంత దూరం రోడ్డుపై పరిగెత్తి మహిళ పడిపోయింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News