Monday, January 20, 2025

పురుగుల మందు తాగి ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: పురుగుల మందు తాగి ఒకరు మృతిచెందిన సంఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండాయిపల్లి గ్రామానికి చెందిన రాధారపు నవీన్‌కుమార్(27) ఆరు నెలల నుంచి అల్సర్ నొప్పితో బాధపడుతుండగా ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో రోజు రోజుకు నొప్పి పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియక జీవితంపై విరక్తి చెంది శనివారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. మోటారు సైకిల్‌పై ఇంటికి తిరిగి వచ్చి కింద పడిపోయాడు. దీంతో నవీన్‌కుమార్ తమ్ముడు వెంకటేష్ అన్న నోటి నుంచి పురుగుల మందు వాసన రావడంతో వెంటనే నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందినట్లు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News