Sunday, December 22, 2024

పురుగుల మందు తాగి ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: పురుగుల మందు తాగి ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నల్లబెల్లి మండలంలోని నారక్కపేట గ్రామానికి చెందిన మామిడి రాకేష్(27) డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం పెయింటర్‌గా పని చేస్తున్నాడు. కాగా పెళ్లి సంబంధాలు రావడం లేదని మనస్తాపానికి గురై మద్యానికి బానిసై సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో గు ర్తుతెలియని పురుగుల మందు తాగి బయటకు వచ్చాడు. పక్క ఇంట్లో ఉన్న జన్ను విజయ్‌ని పిలవడంతో అతను గమనించి రాకేష్ తమ్ముడు నరేశ్‌ను పిలిచి వారిద్దరూ వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి మామిడి జనార్దన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News