Monday, December 23, 2024

లారీని ఢీకొట్టి ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -
  • మరో నలుగురికి గాయాలు

ఘట్‌కేసర్: ముందుగా వెల్తున్న లారీని వెనుకాల నుండి వచ్చిన కారు ఢీకొని అదుపుతప్పి బొల్తపడడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుజుర్‌నగర్ నుండి తెల్లవారుజామున బయలుదేరి రామంతాపూర్ వెల్తున్న యువకులు, ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ సమీపంలోని, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఎన్‌ఎఫ్‌సి నగర్ బ్రిడ్జి వద్ద ముందు వెల్తున్న లారీని వెనుక నుండి కారు డీకొనడంతో అదుపు తప్పి కారు బొల్తాపడగా కారు డ్రైవర్ అఖిల్‌రెడ్డి (24) తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పతికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News