Thursday, December 26, 2024

ఆగి ఉన్న లారీని ఢీకొని ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: మండల కేంద్రం సమీపంలోని పెట్రోలు పంపు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీకి డీసీఎం వ్యాన్ ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం ముగ్దుంపూర్‌కు చెందిన బెదిరోళ్ల సంతోష్(24) గత ఐదేళ్ల నుంచి కంచనపల్లికి చెందిన కొనకంటి అనిల్ డీసీఎంపై జెర్సీ కంపెనీకి చెందిన పాల ఉత్పత్తులు సరఫరా చేసే పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ నుంచి హన్మకొండకు జెర్సీ పాల ఉత్పత్తులను తీసుకొచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఆదివారం ఉదయం డీసీఎం వ్యాన్ రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామానికి చెందిన దాసరి యాకస్వామి డీసీఎం వ్యాన్ అజాగ్రత్తగా నడిపి రోడ్డు కింద వైపు ఆగి ఉన్న లారీని ఢీకొనగా డ్రైవర్ పక్కన కూర్చున్న సంతోష్ వ్యాన్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి బెదిరోళ్ల ఎల్లయ్య ఫిర్యాదు మేరకు డీసీఎం వ్యాన్ డ్రైవర్ యాకస్వామిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ ఘన్‌పూర్ సీఐ రాఘవేందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News