Thursday, December 26, 2024

లారీ ఢీకొని ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

పాల్వంచ టౌన్ : లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం పట్టణ పరిధి శ్రీ నగర్ కాలనీకి చెందిన బిటెక్ చదువుతున్న అనుమాండ్ల సంజీవరెడ్డి (22) సోమవారం రాహుల్‌గాంధీ నగర్‌లోని తన బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో దమ్మపేట సెంటర్ సమీపంలో ఆశ్రమ పాఠశాల దగ్గర

మున్సిపాలిటీకి చెందిన చెత్త వాహనానికి తగిలించిన ఓ బస్తా తన బైక్‌కు తగిలి కింద పడి పోయాడు. అదే సమయంలో భద్రాచలం నుంచి కొత్తగూడెం వెళుతున్న లారీ సంజీవరెడ్డిపైకి ఎక్కడంతో అతడి శరీరం నుజ్జునుజ్జైంది. కాగా మృతుడి తండ్రి మణుగూరు విద్యుత్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నారని సమాచారం. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News