Tuesday, December 24, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

గార్ల: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గార్ల మండలం కోట్యానాయక్‌తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దారావత్ పూమ్య(43) మృతిచెందాడు. ముత్తితండాకు చెందిన పూమ్య తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోచారం గ్రామానికి చెందిన నార్ల వెంకటేశ్ ఎదురుగా వచ్చి ఢీకొనగా పూమ్య అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో పూమ్య కుటుంబ సభ్యులు నార్ల వెంకటేశ్ ఇంటి ముందు పూమ్య మృతదేహాన్ని ఉంచి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూమ్య కుటుంబ సభ్యులు, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News