కొచ్చి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పదవి కోసం పోటీపడే వారి గురించి రాహుల్ గాంధీ ఓ హెచ్చరిక చేశారు. ఒక్కరు ఒక్కపోస్టులో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రాజస్థాన్ సీఎం గెహ్లోట్ పోటీలో నిలబడే ఛాన్సులు ఉన్నాయి. గెహ్లాట్ డబుల్ రోల్ ప్లే చేస్తారా అన్న ప్రశ్నలు ఇతర నేతలు సంధించారు. ఆ అంశంపై రాహుల్ గురువారం స్పష్టత ఇచ్చారు. ఉదయ్‌పూర్ ఒప్పందం ప్రకారం ఒక్కరికి ఒక్క పోస్టు మాత్రమే వర్తిస్తుందని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ అనేది ఓ ఐడియాలజికల్ పోస్టు అని , కొన్ని ఐడియాలకు ప్రతిరూపమని, ఓ నమ్మకమైన వ్యవస్థకు నిదర్శనమని , ఇండియా విజన్‌కు సంకేతంగా ఆ పోస్టు నిలుస్తుందని రాహుల్ అన్నారు. ఇక అధ్యక్ష పదవి కోసం పోటీపడే వారి సంఖ్య పెరుగుతోంది. మనీశ్ తివారి కూడా కాంగ్రెస్ చీఫ్ పోస్టుకు పోటీ పడనున్నట్టు తెలుస్తోంది.
ఒకరికి ఒకటే పదవి.. రాహుల్ వివరణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -