Friday, January 17, 2025

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: జోగి రమేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓటర్ల జాబితా అవకతవకలు, టిడిపి నేతల అక్రమాలపై నేతలు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక చోటనే ఓటు ఉండాలని వైసిపి నేత జోగి రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని వైఎస్‌ఆర్‌సిపి నేతలు కలిశారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. టిడిపి ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని దుయ్యబట్టారు. లక్షల ఓట్లు తొలగించారని ఒక రోజు లక్షల ఓట్లు చేర్పించారని ఇంకోరోజు రాస్తున్నారని జోగి రమేష్ చురకలంటించారు. ఎలాగో ఓడిపోతామని తెలిసే అలాంటి రాతలు రాస్తున్నారని జోగి ధ్వజమెత్తారు. 70 రోజులు పారిపోయిన లోకేష్… వైసిపి మంత్రులకు భయం చూపుతాడంట అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఉరికెత్తించి ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News