Friday, January 24, 2025

‘గుండెపై ఒకే ఒక గుద్దు గుద్ది నవాల్ని చంపారు’

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని జైలులో దుర్మరణం చెందడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రష్యా గూఢచారి సంస్థ కెజిబి వేగులు ఈ హత్య చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవాల్ని గుండెపై ఒకే ఒక గుద్దు గుద్ది హత్య చేసి ఉంటారని మానవ హక్కుల కార్యకర్త వ్లాదిమిర్ ఒసెచిన్ ఆరోపణలు చేశారు. నవాల్ని హత్య చేసే ముందు అతడి శరీర ఉష్ణోగ్రతను జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రతో ఉంచడంతో రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది, అదే సమయంలో గుండెపై గుద్దితే అక్కడే అతడు చనిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాలో గుండెపై ఒకే ఒక పిడి గుద్దు గుద్ది చంపే శిక్షణ ఇస్తారు.

గత వారం ఆర్కిటిక్ పోలార్ వోల్ఫ్‌లోని పీనల్ కాలనీ జైలులో అలెక్సీ నవాల్ని అనుమానాస్పదస్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. జైలులో సాయంత్రం వాకింగ్ వెళ్లిన తరువాత అస్వస్థతకు గురై మృతి చెంది ఉంటారని జైలు అధికారులు పేర్కొన్నారు. వివాదాస్పదంగా మారిన నావల్ని మృతిపై రష్యాలో ఆయన అభిమానులు ఆందోళన చేస్తున్నారు. అమెరికాతో సహా పలు దేశాలు నవాల్ని మృతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌నే కారణమని భావిస్తున్నాయి. నవాల్ని భార్య, కూతురును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియాలో కలిసి పరామర్శించిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News