Monday, December 23, 2024

ఎన్నికలలో ఒక్కసీటు పోటీ పరిమితి

- Advertisement -
- Advertisement -

One-seat contest limit in elections

కేంద్రానికి సిఇసి రాజీవ్ సూచన

న్యూఢిల్లీ : ఎన్నికలలో ఒక అభ్యర్థి రెండు సీట్ల నుంచి పోటీ చేయరాదనే ప్రతిపాదనను ఎన్నికల సంఘం మరోమారు ప్రస్తావించింది. పలు స్థానాల పోటీ నిషేధంపై నిర్ణయం తీసుకునే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సి ఉందని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ సూచించారు. అయితే ఎన్నికల విధానంలో సంస్కరణల ప్రక్రియలో ప్రధానమైన ఈ అంశం కొత్తదేమీ కాదు. 2004లోనే ఈ ప్రతిపాదన వచ్చింది. ఒక్క అభ్యర్థి పలు లేదా రెండు స్థానాల నుంచి పోటీకి దిగడం ఎన్నికల సక్రమ ప్రక్రియకు ఎంతవరకు దోహదం చేస్తుందనే ప్రశ్నను ఎన్నికల సంఘం ప్రస్తావించింది. ఈ అంశాన్ని ఇప్పుడు ఎన్నికల ప్రధానాధికారి న్యాయ మంత్రిత్వశాఖకు చెందిన లెజిస్లేటివ్ కార్యదర్శితో జరిపిన ఇష్టాగోష్టిలో చర్చించారు. ఒక అభ్యర్థి రెండు చోట్ల నుంచి పోటీకి దిగడం రెండుచోట్లా గెలిస్తే రాజీనామా చేయడం, ఉప ఎన్నికకు దారితీయడం వంటి పరిణామాలు తలెత్తుతున్నాయి.

అభ్యర్థి ఒక్క సీటు పోటీ అంశం కార్యరూపం దాల్చకపోతే, ఉప ఎన్నికకు కారకుడు అయిన అభ్యర్థిపై తగు జరిమానాలు విధించాలని కూడా సిఇసి కేంద్రానికి సూచించారని వెల్లడైంది. ఇప్పుడున్న ఎన్నికల చట్టాల మేరకు ఒక్క వ్యక్తి రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు వీలుంది. అయితే ఒకటికి మించి గెలిస్తే సదరు అభ్యర్థి ఏదో ఒక సీటు వదులుకోవల్సి ఉంటుంది. రెండు సీట్లకు మించి పోటీ చేసేందుకు అంతకు ముందు అవకాశం ఉండేది. అయితే 1966 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి జరిగిన సవరణలతో ఈ వెసులుబాటును కుదించారు. ఈ సవరణ రాకముందు వ్యక్తులు పోటీ చేసే స్థానాలపై ఎటువంటి ఆంక్షలు ఉండేవి కావు. అయితే చట్టానికి జరిగిన సవరణలతో రెండు స్థానాలకు వీలేర్పడింది. ఇప్పుడు ఈ అంశానికి కూడా సవరణలు తీసుకురావాలని కేంద్రానికి ఎన్నికల సంఘం సూచించింది. ఇది కుదరకపోతే అభ్యర్థులపై రాష్ట్ర అసెంబ్లీకి అయితే రూ 5 లక్షలు, లోక్‌సభకుఅయితే రూ 10 లక్షలు ఫైన్ విధించాలని రాజీవ్‌కుమార్ ప్రతిపాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News