Monday, December 23, 2024

హైదరాబాద్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One shot dead in Karnamguda near Hyderabad 

హైదరాబాద్: నగర శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం నగర శివార్లలోని కర్ణంగూడలో రియల్టర్ శ్రీనివాస్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన శ్రీనివాస్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఘటనాస్థలంలోనే మరోకరు మృతి చెంది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. తనపై ఎవరో తుపాకీతో కాల్పులు జరిపారని శ్రీనివాస్ రెడ్డి తెలిపాడు. దీంతో అతని నుంచి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

One shot dead in Karnamguda near Hyderabad 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News