Friday, December 20, 2024

పివి రమేశ్ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్… చంద్రబాబును ఏ-1గా మార్చిన సిఐడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : చంద్రబాబు హయాంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి. రమేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోనే ఈ స్కిల్ స్కామ్ డొంక మొత్తం కదిలింది. అవును, టోటల్ స్కిల్ స్కామ్ ఎపిసోడ్‌లో అత్యంత కీలకంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి. రమేశ్  మారారు. ఆనాడు ఎపి ఫైనాన్స్ సెక్రటరీగా పివి రమేశ్  ఉన్నారు. ఆనాడు ఎపి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న పివి రమేశ్ సీమెన్స్‌కి నిధులు విడుదల చేసేందుకు నిరాకరించారు. అప్పటి టిడిపి ప్రభుత్వాన్ని వారించారు. ఆ మేరకు సిఎస్‌కు లేఖ కూడా రాశారు. సీమెన్స్‌కి నిధులు రిలీజ్ చేయొద్దని సూచిం చారు. ఇదే విషయాన్ని సిఐడి విచారణలో స్టేట్‌మెంట్‌గా పివి రమేశ్ ఇచ్చారు. పివి రమేశ్  స్టేట్‌మెంట్ ఆధారంగానే చంద్రబాబుపై అభియోగాలను సిఐడి నమోదు చేసింది.

బాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేసినట్టు సిఐడికి పివి. రమేశ్ వాంగ్మూలం ఇచ్చారు. అందుకే, ఈ స్కామ్‌లో ప్రధాన లబ్దిదారు చంద్రబాబే అని సిఐడి అంటోంది. అంతేకాదు, ఈ కేసులో చంద్రబాబును A37నుంచి A1గా మార్పులు చేసింది. పివి. రమేశ్  వైసిపి ప్రభుత్వంలో కూడా పనిచేశారు. పుణెలో స్కామ్ లింకులు బయటపడ్డాక రమేష్‌ను సిఐడి విచారించింది. సీమెన్స్ ప్రతినిధులను కూడా సిఐడి విచారించింది. పివి రమేశ్  అప్రూవర్‌గా మారడంతో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డొల్ల కంపెనీల లింక్‌లు, ఆధారాలను సిఐడి సేకరించింది. ఈ ఆధారాలను బేస్ చేసుకునే చంద్రబాబు విషయంలో సిఐడి దూకుడు పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News