Thursday, January 23, 2025

దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, ఔరంగాబాద్ స్టేషన్లలో ప్రారంభం

One Station One Product in Railway station

మనతెలంగాణ/హైదరాబాద్:  దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ దక్షిణమధ్య రైల్వే శనివారం ప్రారంభించింది. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, ఔరంగాబాద్ స్టేషన్లలో వీటిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ 30 రోజులు అమల్లో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లను స్థానిక ఉత్పత్తులను విక్రయించేందుకు, ప్రోత్సహించే కేంద్రాలుగా రూపొందించాలన్న లక్ష్యంతో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ వినూత్న కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 06 ప్రధాన స్టేషన్లలో అధికారులు ప్రారంభించారు. తిరుపతి స్టేషన్లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టుకు అద్భుత స్పందన రావడంతో ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, ఔరంగాబాద్ స్టేషన్లలో దీనిని ప్రారంభించారు.

ఏప్రిల్ 09 నుంచి మే 07వ తేదీ వరకు

తొలి సారిగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కావడంతో దీనిని 30 రోజుల పాటు (ఒక విడతలో 15 రోజులపాటు మొత్తం రెండు విడతల్లో 30 రోజులు) అంటే ఏప్రిల్ 09 నుంచి మే 07వ తేదీ వరకు 5 నూతన స్టేషన్లలో అమలు చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో అమలులో ఉన్న ఈ కార్యక్రమం ప్రస్తుతం మరో 30 రోజులకు పొడిగించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహించేలా రైల్వే ష్టేషన్‌ను ఒక విక్రయ కేంద్రంగా ప్రదర్శనశాలగా వినియోగించి స్థానిక హస్త కళాకారులకు, కుమ్మరులకు, చేనేత / వస్త్ర కళాకారులకు, గిరిజనుల జీవనోపాధి, సంక్షేమాన్ని మెరుగుపరిచి స్థానిక పరిశ్రమలను బలోపేతం చేకూర్చాలన్న ప్రధాన లక్ష్యంతో 2022,23 కేంద్ర బడ్జెట్‌లో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడెక్ట్’ విధానాన్ని ప్రకటించింది.

15 రోజులకు నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500లు

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వేలో వినూత్నమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కృషి చేసిన కమర్షియల్ విభాగం అధికారులను, సిబ్బందిని అభినందించారు. ప్రయాణికుల సమక్షంలో స్థానిక కళకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, విక్రయించుకునేందుకు ఈ కార్యక్రమం ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News