Friday, November 22, 2024

54 ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక్క టీచర్‌..

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్(గుజరాత్): గుజరాత్ లోని రెండు జిల్లాల్లో మొత్తం 54 ప్రభుత్వ పాఠశాలల్లో 900 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, ఒక్కొక్క ఉపాధ్యాయునితో ఈ పాఠశాలలు నడుస్తున్నాయని రాష్ట్ర అసెంబ్లీ బుధవారం వెల్లడించింది. అయితే సరైన విద్యాబోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటోందని అసెంబ్లీ వివరించింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆద్మీ పార్టీ ఎమ్‌ఎల్‌ఎ హేమంత్ అహిర్ జామ్‌నగర్, దేవభూమి ద్వారక జిల్లాలో ఉపాధ్యాయుల కొరతపై అడిగిన ప్రశ్నకు రాష్ట్రవిద్యాశాఖ మంత్రి కుబెర్ డిండోర్ సమాచారం అందించారు. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 54 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒక్కో ఉపాధ్యాయునితో నడుస్తున్నాయని వివరించారు.

ఈ 54 పాఠశాలల్లో 46 దేవ్‌భూమి ద్వారకలో ఉండగా, జామ్‌నగర్‌లో 8 ఉన్నాయని తెలియజేశారు. ఉపాధ్యాయులు వేరే జిల్లాలకు బదిలీ కావడం, లేదా రిటైర్ కావడం వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మొత్తం 905 ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలు ప్రభుత్వ నిర్వహణ, గ్రాంటెడ్, నాన్ గ్రాంటెడ్ స్కూళ్లకు సంబంధించినవని వీటిలో జామ్‌నగర్‌లో 330, దేవభూమి ద్వారకలో 575 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల కొరతతో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోందని చెప్పారు. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందన్నారు. పెర్మనెంట్ టీచర్లు నియామకమయ్యే వరకు టీచర్లు లేని స్కూళ్లకు ప్రవాసి (విజిటింగ్) టీచర్లను ప్రభుత్వం పంపిస్తోందని తెలిపారు.

జామ్‌నగర్‌లో 102 మంది , , దేవ్‌భూమి ద్వారకాలో 256 మంది విజిటింగ్ టీచర్లను నియమించినట్టు చెప్పారు. కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ శైలేష్ పార్మర్ అడిగిన సంబంధిత ప్రశ్నకు మంత్రి డిండోర్ సమాధానమిస్తూ అహ్మదాబాద్ జిల్లా ప్రాథమిక పాఠశాలల్లో 1708 ఖాళీలు, గాంధీనగర్ జిల్లా ప్రాథమిక పాఠశాలల్లో 374 మొత్తం 2082 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి డిండోర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News