Wednesday, January 22, 2025

బరువు తగ్గితే ప్రతీ కిలోకి వెయ్యి కోట్లు

- Advertisement -
- Advertisement -

One thousand crores per kilogram of weight loss: Gadkari

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సవాలును స్వీకరించిన బిజెపి ఎంపి

భోపాల్: ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరిన సంగతి తెలిసిందే. అందుకు కేంద్రమంత్రి గడ్కరీ.. ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియాకి ఒక షరతు విధించారు కూడా. తాను నిధులు మంజూరు చేయాలంటే ముందు తమరు చాలా బరువు తగ్గండి అప్పుడూ మంజూరు చేస్తానంటూ ఒక కండిషన్ కూడా పెట్టారు. అంతేకాదు గడ్కరీ ఫిరోజియా తాను ఏవిధంగా బరువు తగ్గానో కూడా వివరించి చెప్పారు.. ఈ మేరకు గడ్కరీ మాట్లాడుతూ…తాను గతంలో 135 కిలోలు బరువు ఉండేవాడిని, ప్రస్తుతం 93 కిలోలే ఉన్నాను. అప్పుడు ప్రజలు నన్ను అసలు గుర్తు పట్టలేకపోయారు. అందువల్ల మీరు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించండి.

అంతేకాదు తగ్గిన ప్రతి కిలో బరువుకి వెయ్యి కోట్లు చొప్పున మీ నియోజక వర్గం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిరోజియాకి ఒక గొప్ప చాలెంజ్ విసిరారు. దీంతో ఫిరోజియా అప్పటి నుంచి తన ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టడమే కాకుండా బరువు తగ్గ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన రకరకాల వ్యాయామాలు కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రి నియోజకవర్గ అభివృద్ధి పనుల నిధులతో చట్టసభ సభ్యుల శారీరక దృఢత్వాన్ని అనుసంధానించే అభివృద్ధి మంత్రం బాగా పనిచేస్తుందనే చెప్పాలి. ఫిరోజియా కూడా తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు మంజూరయ్యేందుకైనా బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అంతేకాదు వర్షాకాలం సమావేశం కల్లా తగ్గి… ఆయన్ను కలిసి మీరు ఇచ్చిన చాలెంజ్‌ని నెరవేర్చానని గుర్తుచేసి మరీ చెబుతానంటున్నారు కూడా. ఈ మేరకు ఫిరోజియా ఫిరోజియా డైట్ ప్లాన్‌ను పాటిస్తూ…సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేస్తున్న వీడియోల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News