Sunday, December 22, 2024

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై పిడుగు

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆవరణలో శనివారం సాయంత్రం పిడుగు పడింది. ఈ  ఘటనలో జనరేటర్ దెబ్బ తిన్నది. మంటలు ఎగిసి పడ్డాయి. సిబ్బంది సమాచారం అందించగానే అగ్నిమాపక దళం వెంటనే ఘటనా స్థలికి చేరకుని మంటలను ఆర్పారు. దాదాపు రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారుల అంచనా. ఈ ఘటనతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. యూనిట్-1 ను పునరుద్ధరించేందుకు సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జెన్కో అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News