Monday, December 23, 2024

ఒక వాహనం..ఒకే ఫాస్టాగ్ అమలులోకి

- Advertisement -
- Advertisement -

బహుళ వాహనాలకు ఒకే ఫాస్టాగ్ లేదా బహుళ ఫాస్టాగ్‌లను ఒకే వాహనానికి అనుసంధానం చేయడాన్ని నివారించడానికి భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఎఐ) ప్రవేశపెట్టిన ఒక వాహనం, ఒకే ఫాస్టాగ్ విధానం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. పేటిఎం ఫాస్టాగ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త నిబంధనల కోసం వారికి మార్చి 31 వరకు ఎన్‌హెచ్‌ఎఐ గడువు పొడిగించింది. బహుళ ఫాస్టాగ్‌లు ఇక పనిచేయవని, ఒకే వాహనానికి బహుళ ఫాస్టాగ్‌లు

ఏప్రిల్ 1 నుంచి వాటిని వినియోగించడం సాధ్యం కాదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఎలెక్ట్రానిక్ టోల్ వసూలు విధానం సామర్ధాన్ని పెంపొందించడంతోపాటు టోల్ ప్లాజాల వద్ద వాహనాల కదలికలు సజావుగా జరిగేందుకు వీలుగా ఒక వాహనం..ఒకే ఫాస్టాగ్ విధానాన్ని ఎన్‌హెచ్‌ఎఐ తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. మార్చి 15వ తేదీ కల్లా తమ ఖాతాలను వేరే బ్యాంకులకు మార్చుకోవాలంటూ కస్టమర్లతోపాటు పేటిఎం పేమెంట్స్ బ్యాంకు లిబిటెడ్ మర్చెంట్స్‌కు గత నెల ఆర్‌బిఐ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News