ఢిల్లీ: ఢిల్లీలో సోమవారం నుంచి లాక్‌డౌన్ ఉంటుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. సోమవారం రాత్రి పది గంటల నుంచి లాక్‌డౌన్ అమలవుతోందని, వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్ ఉంటుందని తెలియజేశారు. తప్పని పరిస్థితుల్లోనే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని, లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని, ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తుండటంతో ఢిల్లీని వదిలి ఎవరూ వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ పొడిగించాల్సిన అవసరం రాదని భావిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందన్నారు. అందరం కలిసి కరోనా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. వలస కార్మికులు ఎక్కడికి వెళ్లొద్దని, మీకు పూర్త సహాయ సహకారం అందిస్తామన్నారు. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.53 లక్షలకు చేరుకోగా 12,121 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 7.66 లక్షల మంది కోలుకోగా 75 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు.
ఢిల్లీలో వారం రోజులు లాక్‌డౌన్: కేజ్రీవాల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -