Friday, November 22, 2024

ట్విట్టర్‌ను కుదిపేస్తున్న ‘వన్‌వర్డ్ ట్రెండ్’

- Advertisement -
- Advertisement -

One Word tweet trend in Twitter

జో బైడెన్‌నుంచి సచిన్‌దాకా అందరూ దీనిలో భాగస్థులే
 తాజాగా ఉక్రెయిన్
అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం

న్యూఢిల్లీ: ట్విట్టర్‌ను ప్రస్తుతం ‘వన్‌వర్డ్ ట్రెండ్’ కుదిపేస్తోంది. సినీ, క్రీడా, రాజనీయ ప్రముఖులంతా కూడా ఈ ట్రెండ్‌లో పాల్గొంటున్నారు. చెప్పాలనుకున్న విషయాన్ని సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పడమే ఈ ట్రెండ్ ముఖ్య ఉద్దేశం. అమెరికా రైల్వే సర్వీస్ ప్రొవైడర్ అమ్‌ట్రాక్ రెండు రోజుల క్రితం(గురువారం) ‘ ట్రెయిన్స్’ అనే పదాన్ని ట్విట్టర్‌లో ఉంచింది. అక్కడినుంచి ఈ వన్‌వర్డ్ ట్రెండ్ మొదలైందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటుగా ప్రముఖ స్పోర్ట్ పర్సనాలిటీ సచిన్ తెండూల్కర్ కూడా ఇందులో పాల్గొన్నారు. జో బైడెన్ ‘ డెమోక్రసీ అని ట్వీట్ చేస్తే సచిన్ తెండూల్కర్ ‘ క్రికెట్’ అని ట్వీట్ చేశారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఈ వన్‌వర్డ్ ట్రెండ్‌లో బాగస్వామి కావడం గమనార్హం. ఆరు నెలలకు పైగా రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రష్యా బలగాలతో పోలిస్తే ఎంతో బలహీనమైన ఉక్రెయిన్ ఇంతకాలం రష్యాను నిలవరించడం ఆశ్చర్యకరమే.

పాశ్చాత్య దేశాల మద్దతు వల్లనో , ఉక్రెయిన్ బలగాల మనోధైర్యం వల్లనో ఈ యుద్ధం ఇంకా సాగుతోంది. తాజాగా వన్‌వర్డ్ ట్రెండ్‌లో భాగంగా ‘ ఫ్రీడమ్’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో జెలెన్‌స్కీ ఉంచిన సందేశం నెటిజన్ల మనసును దోచుకుంటోంది. ఈ వన్‌వర్డ్ ట్రెండ్ ఇప్పుడు ట్విట్టర్‌లో అద్భుతాలు సృష్టిస్తోంది. ఆసక్తులు, నమ్మకాలు, తెలిసిన విషయాలు..అలా ఏదైనా ఒకే ఒక్క ముక్కలో చెప్పేమార్గం ఇది. వ్యక్తులే కాదు..స్టార్‌బక్స్, డొమినోస్, చివరికి నాసా .. ఇలా అన్నీ ట్విట్టర్‌లో ఈ ట్రెండ్‌లో పాల్గొన్నాయి కూడా. వీటన్నిటికీ లక్షల్లో లైక్‌లు వస్తుండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News