Monday, December 23, 2024

19న భారత్‌లోకి వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్‌ఓపెన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 19న ఒన్‌ప్లస్ ఓపెన్ భారత మార్కెట్లోకి రానుంది. ఇప్పటివరకు ఫోల్డబుల్ ఫోన్లలో దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్‌దే ఆధిపత్యం. మెరుగైన అనుభవం కోసం వన్‌ప్లస్ తెస్తున్న వన్‌ప్లస్ ఓపెన్ దీనికి గట్టి పోలీనిస్తుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5కు ఇది గట్టిపోనిస్తుందని భావిస్తున్నారు.

స్లిమ్ డిజైన్‌తో రూపు దిద్దుకున్న వన్‌పల్స్ ఓపెన్ లైట్‌వెయిట్ ఉంటుంది.ఈ ఫోన్‌పై ఎటువంటి ముడతలు ఉండవని చెబుతున్నారు. ప్రస్తుత ఫోల్డబుల్ ప్మార్ట్‌ఫోన్ల స్టాండర్డ్‌ను వన్‌ప్లస్ ఓపెన్ నెక్స్ లెవల్‌కు తీసుకెళ్తుందని వన్‌ప్లస్ చెబుతోంది. ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదలయిన వన్‌ప్లస్ ఓపెన్ భారత మార్కెట్లో రూ.1,41,490(1699) డాలర్లు పలుకుతుందని భావిస్తున్నారు. వన్ ప్లస్‌ఓపెన్ ధర వెల్లడయిన తర్వాత శాంసంగ్‌కన్నా ఇదే బెటరని యూజర్లు అభిప్రాయపడతారని కంపెనీ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News