Monday, November 18, 2024

ఒఎన్‌జిసికి రూ.247 కోట్ల నష్టం 3.7 శాతం తగ్గిన లాభాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద గ్యాస్ ఉతత్తి సంస్థ అయిన చమురు, సహజవాయువుల సంస్థ( ఒఎన్‌జిసి) అనూహ్యంగాఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో నష్టాలను చవి చూసింది. ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్న వివాదాస్పద పన్ను చెల్లింపులకోసం సంస్థ రూ.12,100 కోట్లు కేటాయించడంతో మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థకు రూ.247.70 కోట్ల నష్టం వచ్చింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఒఎన్‌జిసి రూ.8,859.54 కోట్ల లాభం ఆర్జించింది. భూగర్భంనుంచి తాను వెలికి తీసిన ముడి చమురు, సహజవాయువులపై ఒన్‌జిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుఆ్వలకు రాయల్టీ చెల్లిస్తుంది. అయితే ఈ రాయల్టీపై సర్వీస్ టాక్స్ చెల్లించాలని సేవా పన్నుల విభాగం డిమాండ్ చేస్తోంది.

అయితే దీన్ని ఒఎన్‌జిసి కోర్టులో సవాలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఒఎన్‌జిసి సర్వీస్ టాక్స్, జిఎస్‌టిలతో పాటుగా వడ్డీ కలుపుకొని 2023 మార్చి 31 వరకు రూ.11,558 కోట్లు డిపాజిట్ చేసినట్లు ఒఎన్‌జిసి తెలియజేసింది. అంతేకాకుండా పెనాల్టీ కింద మరో రూ.1,.862 కోట్లు డిపాజిట్ చేసినట్లు సంస్థ తెలియజేసింది. ఈ కారణంగానే కంపెనీ మార్చి త్రైమాసికంలో నష్టాలు చవి చేసినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై న్యాయ సలహా మేరకు వివిధ వేదికలపై పోరాడుతామని ఒఎన్‌జిసి తెలిపింది. ఇది కంపెనీ లాభాలపై ప్రతికూల ప్రభావం చూపించిందని కూడా తెలిపింది. కాగా జనవరిమార్చి త్రైమాసికంలో కంపెనీ రాబడి 5.2 శాతం పెరిగి రూ.36,293 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. కాగా 2022 23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం రూ.38,829 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది వచ్చిన లాభం రూ.40,306 కోట్లతో పోలిస్తే 3.7 శాతం తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News