Friday, January 10, 2025

10 శాతం పెరిగిన ఒఎన్‌జిసి లాభాలు

- Advertisement -
- Advertisement -

ONGC Q4 consolidated PAT rises

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజ సంస్థ ఒఎన్‌జిసి 2022 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.12,061 కోట్ల కన్సాలిటేడెడ్ లాభాలు ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన లాభాలకన్నా ఇది 10 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.10,963 కోట్ల లాభం ఆర్జించింది. సంస్థ ఉత్పత్తి చేసిన, విక్రయించిన ముడి చమురుకు గతంలో ఎన్నడూ లేనంత ఉత్తమ ధర లభించడమే కంపెనీ లాభాలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. కాగా ఒఎన్‌జిసి కార్యకలాపాల ద్వారా ఆర్జించిన రాబడి సైతం గత ఏడాదితో పోలిస్తే 37 శాతం పెరిగింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ.1.14 లక్షల కోట్ల రెవిన్యూ ఆర్జించగా ఇప్పుడు అది రూ.1.55 లక్షల కోట్లకు పెరిగింది. కాగా 2022 ఆర్థిక సంవత్సరానికి 5 రూపాయల ముఖ విలువ కలిగిన షేరుపై రూ.3.25 తుది డివిడెండ్ చెల్లించాలని ఒఎన్‌జిసి బోర్డు సిఫార్సు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News