Friday, December 20, 2024

సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

- Advertisement -
- Advertisement -
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

పుల్కల్: పుల్కల్ మండలం ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూరు ప్రాజెక్టు దానిపూర్తి సామర్థం 29.917 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రం నాటికి ప్రాజెక్టులో నీటి మట్టం 20.860 టిఎంసిలకు చేరుకుంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు ఎగువ భాగమైన కర్ణాటక, మహరాష్ట్ర నుంచి ఇన్‌ప్లో 6506 కొనసాగుతుంది. అవుట్ ప్లో 385 క్యూసెక్కులు నడుస్తుందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఇలాగే మరో వారం రోజులు భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తి సామర్థం నిండే అవకాశాలు ఉన్నాయని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా వరుణుడుకరుణించడంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో ఎడమ కాలువ దిగువన ఉన్న రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏదిఏమైనా ఈ ఖరీఫ్ సీజన్‌లో సింగూరునీటిద్వారా తమ వరిపంటలను పండించుకొనేందుకు ఈ నీరు ఎంతగానో తమకు ఉపయోగపడుతుందని ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరగడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టును అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. దిగువన ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పశువుల కాపరులు, మత్సకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News