Saturday, November 23, 2024

సాగర్‌కు కొనసాగుతున్న వరద

- Advertisement -
- Advertisement -

Ongoing Flood to Nagarjuna Sagar Dam

నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 66,057 క్యూసెక్కులు
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద
జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం

మనతెలంగాణ/హైదరాబాద్ : పలు ప్రా జెక్టుల్లోకి వరదనీటి ప్రవాహం కొనసాగు తుండగా, మరికొన్ని ప్రాజెక్టులోకి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత పరిస్థి తుల్లో ఎల్లంపల్లితో పాటు నాగార్జునసాగ ర్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండగా, జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వ రద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వి డుదల చేశారు. ప్రాజెక్ట్ నుంచి 5,522 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా, ఇన్ ఫ్లో కూడా 5,522 క్యూసె క్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 19.0640 టిఎంసిలుగా ఉంది.

నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 66, 057 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 66,057 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 5 90 అడుగులు కాగా, ప్రస్తుతం 589.70 అడుగులుగా కొనసాగుతోంది. సాగర్ పూ ర్తిస్థాయి నీటినిల్వ 312 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 311 టిఎంసిలుగా ఉంది.

జూరాలకు

జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం ప ట్టింది. జూరాల ఇన్ ఫ్లో 61వేల క్యూసె క్కులు కాగా, ఔట్ ఫ్లో 39,585 క్యూసె క్కులుగా కొనసాగుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 317.880 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9. 657 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 8.377 టిఎంసీలుగా ఉంది.

పులిచింతలలో కనిష్ట స్థాయి..

పులిచింతల ప్రాజెక్టులో కనిష్ట స్థాయికి నీ టిమట్టం చేరడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది. కొట్టుకుపోయిన 16వ గేట్ స్థానంలో స్టాఫ్లాక్ అమర్చేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. పులిచింతల 16, 17 గేట్ల ద్వారా దిగువకు నీటి విడు దల కొనసాగుతోంది. 11 స్టాప్లాక్ గేట్ కు నిపుణులు 3 ఫ్రేమ్లను అమర్చారు. పులి చింతల ఇన్ ఫ్లో 15,517 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 70,740 క్యూసెక్కులు. పులిచిం తల పూర్తి నీటిమట్టం 175 అడుగులు కా గా, ప్రస్తుతం 125.65 అడుగులకు చేరు కుంది. పులిచింతల పూర్తి నీటినిల్వ 45. 77 టిఎంసిలు కాగా ప్రస్తుతం 5.28 టిఎంసిలకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News