Monday, December 23, 2024

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కి కొనసాగుతున్న వరద

- Advertisement -
- Advertisement -

మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతుంది. శుక్రవారం 11.30 గంటల వరకు 69 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టిఎంసిలు కాగా శుక్రవారం మధ్యాహ్ననికి ప్రాజెక్టు నీటిమట్టం 1075.70 అడుగులు 41.452 టిఎంసిలుగా ఉందని అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు నుండి ఆవిరి రూపంలో 430 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 50 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథకు 152 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్ రిజర్వాయర్ నీటిమట్టం 1088.50 అడుగులు 78.023 టిఎంసిలుగా ఉంది. 1 జూన్ నుండి ఇప్పటి వరకు 22.388 టిఎంసిల నీరు వచ్చి చేరింది. 1 జూన్ నుండి ఇప్పటి వరకు 3.249 టిఎంసిల నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News