Monday, December 23, 2024

కొనసాగుతున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ వెరిఫికేషన్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ క్రైం: రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహిస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఇన్‌ఛార్జి పోలీస్ కమిషనర్ సిహెచ్ ప్రవీన్‌కుమార్ ఆదేశాలమేరకు నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కొనసాగుతోంది. సోమవారం టిఎస్‌ఎల్‌బిపిఆర్‌బి2022 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రకియలో ఐదవ రోజు 600 మంది అభ్యర్థులను పిలవగా వారిలో 529 మంది హాజరుకాగా వారి ధృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి (ఎఓ) బి.శ్రీనివాస్, ఆఫీస్ సూపరిండెంట్‌లు శంకర్, మక్పూద్‌హైమద్, గోవింద్, సిపిఓ కార్యాలయ సిబ్బంది, రిజర్వ్ సిబ్బంది, కోర్ సిబ్బంది అభ్యర్థుల పరిశీలనలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News