Monday, December 23, 2024

షీనాబోరా హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

Ongoing probe into the Sheena Bora murder case

కౌంటర్ దాఖలుకు గడువు కోరిన సిబిఐ

ముంబై: షీనాబోరా హత్య కేసులో ఆమె తల్లి, ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఇచ్చిన ట్విస్ట్‌పై దర్యాప్తు కొనసాగుతున్నది. తన షీనాబోరాను తాను హత్య చేయలేదని, ఆమె కశ్మీర్‌లో ఉందని, తనతో పాటు ముంబై బైకులా జైల్లో ఉన్న ఓ మహిళా ఖైదీ కశ్మీర్‌లో తాను షీనాతో మాట్లాడినట్లు వెల్లడించిందని ఇంద్రాణి ముఖర్జియా ఇటీవల వెల్లడించారు. అంతేగాక షీనాబోరా బతికే ఉన్నదన్న అంశంపై దర్యాప్తును ఆదేశించాలని సిబిఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇంద్రాణి ముఖర్జియా పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సిబిఐ న్యాయస్థానం షీనా బతికే ఉందనే అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేసు దర్యాప్తు చేసిన సిబిఐని ఆదేశించింది. అయితే, ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి తమకు 14 రోజుల సమయం ఇవ్వాలని సిబిఐ అధికారులు కోర్టును అభ్యర్థించారు. కాగా, ఇటీల బెయిల్ కోసం ఇంద్రాణి వేసిన పిటిషన్‌ను కూడా సిబిఐ తిరస్కరించింది. దాంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తుంది. ఇదిలావుంటే హత్య కేసు 2015లో వెలుగులోకి వచ్చింది. తల్లి ఇంద్రాణి ముఖర్జియే షీనాబోరాను హత్య చేసినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. దాంతో ఆమె, ఆమె రెండో భర్త సంజయ్ ఖన్నా, మూడో భర్త పీటర్ ముఖర్జియాతో ఇంద్రాణి డ్రైవర్ ఈ కేసులో అరెస్టయ్యారు. పీటర్ ముఖర్జియా బెయిలుపై బయటకు వెళ్లి ఇంద్రాణికి డైవర్స్ ఇచ్చాడు. ఇంద్రాణికి మిగతా నిందితులకు మాత్రం ఇప్పటికీ బెయిల్ రాలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News