Sunday, February 23, 2025

ఎస్‌ఎల్‌బిసిలో కొనసాగుతున్న సహాయక చర్యలు

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్: జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలతో సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు బృందాలతో రెస్క్యూ టీం సభ్యులు 11 కిలో మీటర్ల వరకు ట్రైన్ లో వెళ్లారు. అక్కడి నుంచి 14 కిలో మీటరు మైలు రాయి వరకు నడుచుకుంటూ వెళ్లారు. ఎక్కువగా బురద ఉండడంతో ముందుకు వెళ్లడానికి వీలు లేకుండా ఉంది. టన్నెల్ బోరింగ్ మిషన్ లో ఇరువైపుల బురద ఉండడంతో నీళ్లు తొడడం కష్టంగా ఉందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనకకు జరిగిందని అధికారులు వెల్లడించారు. నీటి, బురద తోడే వరకు చిక్కుకున్నారని బయటకు తీసే పరిస్థితి లేదన్నారు. సహాయక చర్యలో 150 మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News