- Advertisement -
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఖార్కివ్ ను రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి. జనావాసాలపైనా దాడులు జరిగినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా దాడులను ఉక్రెయిన్ సేనలు దీటుగా తిప్పికొడుతున్నాయి. కీవ్ పై పట్టు కోసం రష్యా సైనిక చర్యను ఉద్ధృతం చేసింది. ఒకిట్రికా నగరంలోని సైనిక స్థావరంపై రష్యా దాడి చేసింది. కీవ్ కు ఉత్తరాన సుమారు 65 కిలోమీటర్ల మేర భారీ స్థాయిలో రష్యా సైనికులు మోహరించారు. ఖార్కీవ్ లో రష్యా దళాల మిసైల్ దాడులు జరిపింది. చారిత్రక భవనంపై బలగాలు విసైల్ దాడి చేశారు. రష్యా దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఇప్పటివరకు 5,710 మంది రష్యన్ సైనికులను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించింది.
- Advertisement -