Monday, December 23, 2024

కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులు

- Advertisement -
- Advertisement -

హన్మకొండ : హన్మకొండ పరిధిలో కొనసాగనున్న, కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులను హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, బల్దియా కమిషనర్ రిజ్వాన్ బాషా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా 49వ డివిజన్‌లో గల బంధం చెరువు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మించనున్న ల్యాండ్ స్కేప్, లైటింగ్, వాక్ వే పనులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్‌టీపీలో పర్యటించి దెబ్బతిన్న రోడ్లను పునరు ద్దరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గాంధీనగర్‌లో ఇటీవల ఏర్పాటుచేసిన నమూనా వైకుంఠ ధామాన్ని పరిశీలించారు. అనంతరం తులసీ బార్ ప్రాంతంలో నిర్మిస్తున్న డక్ట్ పనులను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న 4 శాతం పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మానస రాంప్రసాద్, సిరంగి సునీల్‌కుమార్, బల్దియా ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, సీహెచ్ శ్రీనివాసరావు, ఈఈ రాజయ్య, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News