- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం బంగ్లాదేశ్, మారిషస్, బహ్రయిన్, భూటాన్ దేశాలకు మార్చి 31 వరకు 54,760 టన్నుల ఉల్లిని ఎగుమతి చేయడానికి అనుమతించింది. బంగ్లాదేశ్‌కు 50,000 టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రాయిన్‌కు 3,000 టన్నులు, భూటాన్‌కు 500 టన్నులు ఉల్లి ఎగుమతులకు అనుమతించినట్టు కన్సూమర్ అఫైర్స్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సిఫార్సు మేరకు ఉల్లిని ఎగుమతి చేయడానికి నిర్ణయించినట్టు చెప్పారు.
- Advertisement -