ఇప్పటికే రూ.50ను క్రాస్ చేసిన ఉల్లి
ఆందోళనలో వినియోగదారులు
కొద్ది రోజుల్లోనే పరిస్థితి సర్దుకుంటుంది : అధికారులు
హైదరాబాద్: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కారణంగా దానిలో ఉండే అనేక పోషకాలు రోగ నిరోధక శక్తులుగా పని చేస్తాయి. అంతే కాకుండా ఈ పంట కాలాలతో సంబంధం లేకుండా దిగుబడివచ్చే పంట. అంతే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అతి తక్కువ ధరలో లభించేది కావడంతో ప్రతి వంటకంలోనే కాకుండా పిండి వంటల్లో కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. భారీవర్షాల కారణంగా పంటలు దెబ్బతింటే తప్ప.. దానికి దిగుబడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతటి ప్రాధాన్యత సంతరించకున్న ఉల్లి దిగుబడుల్లో మార్పులు చేర్పు లు చోటు చేసుకోవడంతో దాని ప్రభావం కూడా ఉల్లి ధరల మీద పడుతోంది. గతంలో కిలో ఉల్లి రూ.10 నుంచి 15 వరకు పలికిని ఉల్లి నేడు రైతు బజార్లలో కిలో రూ.30 నుంచి 35 పలుతోంది. మారెట్లోలో వీటి ధర ఇలా ఉంటే బహిరంగ మార్కెట్లో వీటి ధర కిలో రూ. 50 నుంచి 55 పలుతుండటంతో వినియోగదారులు వీటిని కొనుగోలు చేయాలంటే భయపడిపోతున్నారు.
గతంలో కిలో ఉల్లి రూ. 100 నుంచి 150 వరకు పకలడం దాంతో ప్రభుత్వం ఉల్లి కోసం ప్రత్యేక కౌంటర్లను ఏ ర్పాటు చేయడం వంటి సందర్భాలు ఉన్నా యి. ప్రస్తుతం పరిస్థితి కూడా అటువంటి సంఘటలను పునరావృతం అవుతాయేమోనని వినియోగదారులు ఆందోళనకు లోనవుతున్నారు. రాష్ట్రాల్లో ఉల్లి కొరత ఉన్నప్పడు కేంద్ర ప్రభుత్వం వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి పాకిస్తాన్, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుని రాష్ట్రాలకు సరఫరా చేసిన విషయం తెలిసిందే. .ముఖ్యంగా మన రాష్ట్రం ఉల్లి కోసం పోరుగు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్‌లోని కర్నూలు మీద అదే విధంగా ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్ర,కర్నాటకల మీద ఆధార పడుతోంది. కాని ప్రస్తుతం ఆయా రాష్ట్రాలో కూడా పంట దిగుబడి తగ్గడంతో ఉల్లి ధరలు ఒక్కసారి ఆశాన్ని అంటుతున్నాయి.
పోరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి నగరానికి కేవలం రెండు మూడు లారీలు మాత్రమే వస్తున్నాయి. దీంతో మనం మహారాష్ట్ర మీద ఆధారపడాల్సి వస్తోంది. గతంలో మహారాష్ట్ర నుంచి ఆశించిన దానికి కంటే ఎక్కువ కావడంతో స్టాకును నిల్వ చేసుకున్న వారు ప్రస్తుతం పంట దిగుబడి తగ్గి ధర పెరగడంతో ఆ ప్రాంత రైతులు వాటిని నగరంలోని మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా ఉల్లి ధర కిలో రూ.25 నుంచి 30 పలుకుతుండగా నగర బహిరంగ వాటి ధర కిలో రూ.50 నుంచి 55 పలుకుతోంది. ఉల్లి దిగుమతి చేసే రాష్ట్రాల్లో పంట దిగుబడి తగ్గడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని, మరి కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు.