Tuesday, January 21, 2025

కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి

- Advertisement -
- Advertisement -

ఉల్లిపాయలు పౌరులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పలు నగరాల్లో మార్కెట్ల వ్యాప్తంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దీనితో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉల్లి ధర టోకు మార్కెట్లలో కిలో రూ. 4060 శ్రేణి నుంచి రూ. 70100 శ్రేణికి పెరిగాయి. ఢిల్లీ మార్కెట్‌లో ఒక విక్రేత ‘ఎఎన్‌ఐ’ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఉల్లి ధరలు కిలోకు రూ. 60 నుంచి రూ. 100కు పెరిగాయి. మేము సంత నుంచి సరకు తెప్పిస్తుంటాం. దాని వల్ల మాకు అక్కడి అందిన ధరల ప్రకారమే ఇక్కడ విక్రయిస్తుంటాం. ధరల పెరుగుదల కారణంగా అమ్మకాలు తగ్గాయి.

కానీ, ఉల్లి ఆహార అలవాట్లలో ముఖ్య భాగం కనుక జనం దానిని కొంటున్నారు’ అని చెప్పారు. ఉల్లి ధర పెరుగుదలపై ఒక మహిళా కొనుగోలుదారు ఫయిజా ఆందోళన వ్యక్తం చేశారు. ‘సీజన్ ప్రకారం ధర తగ్గి ఉండవలసింది కానీ ఉల్లి ధర పెరిగింది. నేను కిలో రూ. 70 ధరకు ఉల్లి కొనుగోలు చేశాను. అది ఇంటిలో ఆహార అలవాట్లను ప్రభావితంచేసింది. రోజూ తినే కూరగాయల ధరలనైనా కనీసం తగ్గించవలసిందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆమె చెప్పారు. ఢిల్లీలో ఉల్లి ధర ఈ నెల 8న కిలో సుమారు రూ. 80గా ఉంది. ముంబయి మార్కెట్లతోసహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉల్లి ధర పెరుగుతూనే ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News