Monday, January 20, 2025

మోడీకి ఉల్లి ఘాటు

- Advertisement -
- Advertisement -

ధరల పతనంతో అన్నదాత ఆగ్రహం ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్

ఢిల్లీకి బాక్సుల్లో రైతుల ప్రత్యేక పార్శిళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రధాని నరేంద్రమోడీకి ఉల్లిఘాటు తగిలింది. ధర ల పతనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులు ఆవే దనతో కేంద్రప్రభుత్వ నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ ఏకంగా తాము పండించిన ఉల్లి పంటను బాక్సు ల్లో ప్రత్యేకంగా ప్యాక్ చేయించి ప్రధానమంత్రికి చేరేలా ఢిల్లీకి పార్ళిళ్లు పంపారు. ఉల్లి పంటను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందకు వీ ల్లేకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎ త్తివేయాలని డిమాండ్ చేస్తూ లేఖలు రాశారు. దే శంలోని ఉల్లి పండించే ప్రధాన రాష్ట్రాల్లో ఈ ఏడా ది ఉల్లి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ధరల పతనం కోలుకోలేనంతగా దెబ్బతీస్తోం ది. ఆరుగాలం శ్రమకోర్చి వేల రూపాయలు పెట్టు బడి పెట్టి ఉల్లి పంట పండిస్తే తీరా మార్కెట్‌లో ధ రలు పడిపోవటంతో రైతులు కన్నీటి పర్యంతమ వుతున్నారు. దేశంలో ఈసారి 9.58లక్షల హెక్టార్ల కు పైగానే ఉల్లిపంట సాగు జరిగింది. ఫిబ్రవరి చివరివారం నుంచి పంట దిగుబడి ప్రారంభమైం ది. మార్కెట్లో కొత్త సరుకు కొనుగోలుకు వ్యాపారు లు ఆసక్తి చూపడం లేదు. దేశంలో ప్రధానంగా ఉ ల్లి పండించే రా్రష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, రా జస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోనే 90శాతం ఉల్లి సాగవుతోంది. జాతీయ స్థాయిలోనే కాకుండా ఆ సియాలోనే ఉల్లి పంట కొనుగోళ్లకు మహారాష్ట్రలో ని లాసల్‌గావ్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ మా ర్కెట్లో రోజు వేల టన్నుల్లో ఉల్లి విక్రయాలు జరుగు తుంటాయి.

అయితే ఈ ఏడాది ఈ మార్కెట్లో ఉల్లి పంట కొనుగోలుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక్కడ రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిపంట పెద్ద మొత్తంలో విదేశాలకు ఎగు మతి అవుతుంటుంది. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో పండించిన ఉల్లిపంటను విదే శాలకు ఎగుమతి చేయకుండా నిషేధం విధించిం ది. దీంతో వ్యాపారులు ఉల్లిపంటకు ధరపెట్టి కొ నేందుకు ముందుకు రావడం గత నెల చివ రి వారం నుంచి ధరలు పతనమవుతూ వస్తున్నా యి. రాజేంద్ర అనే ఉల్లి రైతు తాను పండించిన 512 కిలోల ఉల్లిని లాసల్ గావ్ మార్కెట్‌కు తెచ్చి విక్రయించగా క్వింటాలకు రూ.100ధరతో కొనుగోలు చేసిన వ్యాపారులు హామాలీ ఖర్చులు , రవాణా ఖర్చులు మినహాయించి సరుకు మొత్తానికిగాను రైతుకు రెండు రూపాయలు చెల్లించారు.అది కూడా చెక్‌రూపంలో చేతికి అందించారు. ఈ పరిస్థితి రాజేంద్ర అనే రైతు ఒక్కరికే కాదు.. మహారాష్ట్రతోపాటు మిగిలిన పలు రాష్ట్రాల్లోని ఉల్లిరైతులు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్కెట్‌లో ఉల్లి ధరలు ఏమాత్రం మెరుగు పడలేదు. ఉల్లిమార్కెట్ సంక్షోభం 10రోజులుపైగా కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు ఆవేదనతో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపట్ల రగిలిపోతున్నారు.

నిషేధం ఎత్తివేయండి..

కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి మార్కెట్లకు వచ్చిన ఉల్లిపంటను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసి ఆదుకోవాని ఉల్లి రైతులు గత వారం రోజులుపైగా కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా స్పందన కనిపించటం లేదు. పంట కొనుగోలు చేయకపోతే తాము ఆత్మహత్యలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకుంటూ ఉల్లిరైతులు ప్రధాని నరేంద్రమోడి పేరుతో ఇప్పటికే లేఖలు రాశారు. మంగళవారం మహారాష్ట్రలోని అహ్మద్ నగర ప్రాంతానికి చెందిన మరికొందరు రైతులు ఉల్లిపంటను బాక్సుల్లోపెట్టి ప్రధాని పేరుతో ఢిల్లీకి ప్రత్యేక పార్శిళ్లు పంపారు.

పిలిప్పీన్స్‌లో కిలో ఉల్లి రూ.1200

దేశంలో ఉల్లిపండించే పలు రా్రష్ట్రాల్లో ఉల్లి పంట ధరలు పతనమై రైతులు కన్నీటిపర్యంతమవుతుంటే, మార్కట్ ఇంటర్వేన్షన్ పథకాల ద్వారా ఉల్లిరైతులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ నిర్లక్షవైఖరిని రైతుసంఘాలు తప్పుపడుతున్నాయి. అంతర్జాతీయంగా పిలిప్పీన్స్‌లో కిలో ఉల్లి ధర రూ.1200ఉంది. మనదగ్గర ఉల్లి రైతుకు కనీసం రూ.2కూడా లభించటంలేదు. ప్రపంచ దేశాల్లో ఉల్లి సాగు ఉత్పతిలో మనదేశం రెండవ స్థానంలో ఉంది. ఇంతగా ఈ పంట సాగు చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కనీసం ఉల్లిపంట సాగులో కాని, ఉత్పత్తి, మార్కెటింగ్‌లో కాని ఏవిధమైన ప్రణాళికలు రూపొందించకపోవటం ఉల్లిధరల పతనానికి ఒక కారణంగా ఆరోపిస్తున్నారు. దేశంలో ఎంత దిగుబడి వస్తుంది, దేశీయంగా ఉల్లి వినియోగం పోను మిగిలిన పంటను విదేశీమార్కెట్లకు తరలించి రైతులకు లాభసాటి ధరలు లభించేలా బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం అమలు చేస్తుండటం ప్రధాని మోడికి ఉల్లి రైతలపట్ల ఉన్న నిర్లక్షతకు అద్దం పడుతోందంటున్నారు. తక్షణం ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News