- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: వానాకాల పంటగా సాగు చేసిన ఉల్లి ఇప్పుడిప్పుడే మార్కెట్లకు చేరుతోంది. ఈ సారి ఉల్లిసాగు చేసిన రైతులకు ప్రారంభంలోనే నష్టాలు నషాలానికి అంటుతున్నాయి. వ్యాపారులు ధరలు తొక్కిపెట్టడంతో ఉల్లిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరుగున ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ధర రూ.300 మించి వ్యాపారులు ధర పెట్టడం లేదు. అదే తెలంగాణ రాష్ట్ర మార్కెట్లలో ఉల్లిధరలు భగ్గుమంటున్నాయి. కిలో ఉల్లి గడ్డలు రూ.25నుంచి రూ.30కి విక్రయిస్తున్నారు. వేల రూపాయల పెట్టుబడి ఖర్చులు భరించి ఆరుగాలం శ్రమించి పండిస్తున్న ఉల్లిపంట ద్వారా రైతులకు నష్టాలు వస్తుండగా, అదే వ్యాపారులు మాత్రం ధరలు పెంచి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- Advertisement -