- Advertisement -
హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బిసిల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. లాండ్రీలు, దోబీఘాట్లు, సెలూన్లకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. రెండు లక్షల మంది రజక, 70 వేల నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు. ఉచిత విద్యుత్ కోసం ఆన్‌లైన్ www.tsobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని కమలాకర్ సూచించారు. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలియజేశారు.
- Advertisement -