హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది. గురుకులాల్లోని వివిధ పోస్టుల భర్తీకి గాను గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు ఇదివరకే నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 17 నుండి మే 17వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి గురుకుల నియామక బోర్డుకు ఇప్పటికే వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఒటిఆర్) ప్రక్రియను ప్రారంభించింది.
Also Read: అధికారంలోకి రాగానే ఖాళీ ఉద్యోగాల భర్తీ చేస్తాం: బండి సంజయ్
టిఎస్‌పిఎస్‌సి తరహాలో ఒటిఆర్ నమోదు ద్వారా వచ్చే నంబర్‌తో నోటిఫికేషన్ల వారీగా అర్హత కలిగిన పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకొనే విధానాన్ని గురుకుల నియామక బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది. గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీ కోసం బోర్డు 9 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన విషయం తెలిసిందే. గురుకుల డిగ్రీ, గురుకుల జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు, 24 నుంచి పిజిటి, స్కూల్ లైబ్రేరియన్, స్కూల్ పిడి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, 28 నుంచి టిజిటి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్నది.