Saturday, March 29, 2025

ఆన్‌లైన్ బెట్టింగ్ అంతర్జాతీయ నేరంగా మారింది: సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ల గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన కొందరు సెలబ్రిటీలను పోలీసులు విచారించారు కూడా. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేస్తామని సిఎం వెల్లడించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రస్తుతం అంతర్జాతీయ నేరంగా మారిందని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రచారం కల్పించివారిని విచారించడమే పరిష్కారం కాదని.. సిట్ ఏర్పాటుతో వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News