నలుగురి అరెస్టు, పరారీలో ముగ్గురు
రూ.8,65,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.8,65,000 నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, కారు, ల్యాప్‌టాప్, బ్యాంక్ పాస్‌బుక్, డెబిట్ కార్డులు, రౌటర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బహదూర్‌పల్లికి చెందిన సయిద్ జమీర్ ఉద్దిన్ ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. కుల్సుంపురకు చెందిన ఖాజా ఆసిమ్ అహ్మద్, ఎండి షాజయాబ్, ఆజాం ఖాన్, సయిద్ అజహర్ ఉద్దిన్, సయిద్ జహీర్ ఉద్దిన్, తాహుద్దిన్ కలిసి ఆన్‌లైన్ గేమింగ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నిందితుల్లో సయిద్ అజహర్ ఉద్దిన్, సయిద్ జహీర్ ఉద్దిన్, సయిద్ జమీరుద్దిన్ సొంత అన్నాతమ్ముళ్లు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ వేసిన నిందితులు ముఠాను తయారు చేశారు.
వారి సహకారంతో అహ్మద్‌కాలనీ, లంగర్‌హౌస్‌లో నిర్వహిస్తున్నారు. mahadevbook.com ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వాట్సాప్ నంబర్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ నిర్వహించేవారు వాట్సాప్ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. బెట్టింగ్ నిర్వహించేవారికి ఐడి, పాస్‌వర్డ్ పంపిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు నిర్వహిస్తున్నారు. క్రికెట్, టీన్‌పట్టి, క్యాసినో గేమ్స్, ఫుట్‌బాల్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఐస్‌హాకీ, గోల్ఫ్, బాక్సింగ్, హ్యాండ్ బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, టేబుల్‌టెన్నిస్, టేబుల్ టెన్నిస్, స్నూకర్, ఫార్ములా రేస్, స్కై జంప్, వాటర్ పోలో గేమ్స్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. 17 వెబ్‌సైట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐసిఐసిఐ, కోటక్ బ్యాంక్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. 500 నుంచి 550 పంటర్లు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సై శ్రీకాంత్, అశోక్ రెడ్డి, శివనందనం తదితరులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు.