Monday, December 23, 2024

ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వరంగల్ : వరంగల్ పట్టణంలోని ఓసిటి కేంద్రంగా ఆన్‌లైన్ గేమ్స్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు యువతులతో సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్‌జోన్ డిసిపి ఎంఎ బారి తెలిపారు. గురువారం హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డిసిపి ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా వివరాలు వెల్లడించారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన పఠాన్‌బాబా, పటాన్‌ఖాసీంఖాన్, ఒడిషాకు చెందిన నాగ్, సయ్యద్‌సల్మాబేగ్, ఖమ్మంకు చెందిన మొగల్ మున్న, గుంజ కల్యాణ్ వీరందరు ఒక ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్ గేమ్స్ బెట్టింగ్ ప్రారంభించారు.

Also read: 15న ఓరుగల్లులో నిరుద్యోగ మార్చ్

Online betting gang arrested in Warangal

Also read: దానికోసమే ‘అంఖడ’ మూడుసార్లు చూశా: రాఘవ లారెన్స్ ఇంటర్వ్యూ..

ఇందుకోసం ఈముఠా సభ్యులు ఒక యాప్ ద్వారా ఐపిఎల్ ప్రారంభం కావడంతో క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించారు. గతంలో ఈముఠా ఖమ్మంలోనూ బెట్టింగ్ నిర్వహించారు. ఓసిటి కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో మిల్స్‌కాలనీ పోలీసులు బుధవారం సాయంత్రం దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు డిసిపి తెలిపారు. వారివద్ద నుండి మూడు ల్యాప్‌టాప్‌లు, 13 సెల్‌ఫోన్లు, రూ.లక్ష 90 వేల నగదు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. ఈబెట్టింగ్ ముఠాను పట్టుకున్న వరంగల్ ఎసిపి కిషన్, మిల్స్‌కాలనీ సిఐ శ్రీనివాస్, సైబర్‌క్రైం సిఐ జనార్దన్‌రెడ్డి తదితరులను డిసిపి అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News