ఈ టక్కుటమారా మాటలతో బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు : సజ్జనార్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడొద్దని టిజిఎస్‌ఆర్‌టిసి ఎండి సజ్జనార్ హెచ్చరించారు. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు అంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికర బెట్టింగ్ వీడియోను పోస్ట్ చేస్తూ యువతను అలర్ట్ చేశారు. ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారని పేర్కొన్నారు. తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యసనపరులను చేస్తూ, వారి ప్రాణాలను తీస్తున్న వీళ్లంతా సంఘ విద్రోహ శక్తులే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువకుల్లారా ఈజీగా మని సంపాదించాలనే ఆశతో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మాయమాటల్లో పడకండి అని సూచించారు. బంగారు జీవితాలను నాశనం చేసుకోకండి అని సూచించారు. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు, మీ కష్టాన్ని నమ్ముకోండి. విజయం దానంతట అదే మీ దరికి చేరుతుంది అని తెలిపారు. జీవితంలో ఎదగాలంటే ఇలాంటి బెట్టింగులకు అలవాటు పడవద్దని తెలిపారు. బెట్టింగులు వ్యసనంగా మారి అప్పుల ఊబిలో పడొద్దని సూచించారు. సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలకు చెక్ పెట్టాలంటే.. బాధితులందరూ ముందుకువచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. లేకుంటే ఈ గొలుసు కట్టు సంస్థల మాయలో పడి అందరూ ఏదో ఒక రోజు బాధితులవుతారు. మోసపూరిత #MLM సంస్థల్లో చేర్పించిన వారితో పాటు… pic.twitter.com/VnbxaCrnq8
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 20, 2023